Himaja : మీ మాటలు.. మా పేరెంట్స్ వింటే తట్టుకోలేరు – హిమజ
టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ హిమజ రెడ్డి అంటే తెలియని వారుండరు. ఎంతో కష్టపడి బుల్లితెర నుంచి వెండి తెర వరకు ఎదిగింది. కరోనా లాక్డౌన్ టైంలో యూట్యూబ్ ఛానెల్, ఇన్స్టాగ్రామ్ వీడియోల ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ సత్తా చాటి. ఎంతో కష్టపడి కారు, ఇల్లు కనుక్కొని తన కల నెరవేర్చుకున్నారు. కానీ హిమజ లగ్జరీ లైఫ్‌పై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు కొందరు. వీటిని కొన్నాళ్లు భరించినా.. నెటిజన్లు హద్దు మీరడంతో తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు హిమజ. తన సంపాదన, లగ్జరీ లైఫ్ గురించి దారుణంగా కామెంట్స్ చేస్తున్న వారికి క్లాస్ పీకారు.
Also Read : Niharika : ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? అవార్డు వేడుక నిర్వాహకులపై మెగా డాటర్ నిహారిక ఫైర్!
Also Read
‘నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నాను అంటే సంపాదిస్తున్నానని కదా అర్థం. ఉదయం నుంచి రాత్రి వరకు సినిమాల్లో, సీరియల్స్‌లో కష్టపడుతున్నాను. బిగ్‌బాస్ నుంచి వచ్చాక 12 షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేశాను. ఒక్కో దానికి ఎంత ఇస్తారో తెలుసా? నా కారు కొనడానికి ఆ సంపాదన చాలు. సినిమాలే కాకుండ హెర్బా లైఫ్‌కు సూపర్వైజర్ అని, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తా, సొంతంగా ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాను. నేను పడుతున్న కష్టం ఎవరికీ కనిపించదు. నేను కొన్న ఇంటికి మా అమ్మానాన్నలు కూడా ఎంతో సాయం చేశారు. అది తెలియకుండా ఎవరో గిఫ్ట్ ఇచ్చారని కామెంట్స్ పెడితే వాళ్ళ గుండె పగిలిపోతుంది. నా ఈఎంఐ (EMI) పేపర్లు కూడా చూపించాలని అనుకున్నా. ఎదుటివారి సక్సెస్ చూసి ఏడవకండి’ అంటూ ట్రోలర్లకు గట్టిగా బుద్ధి చెప్పారు. ఒక తెలుగమ్మాయి సక్సెస్ అయితే అభినందించడం మానేసి, ఇలా క్యారెక్టర్ మీద పడి ఏడవడం సంస్కారం కాదని హిమజ హితవు పలికారు. హద్దు మీరితే మాత్రం ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్‌బై!
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!