Bigg Boss : భార్యాభర్తల మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్.. విడాకులు తీసుకోబోతున్న భార్యాభర్తలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్.. ఈ పేరు ఒకప్పుడు బాగా ఫెమస్.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది.. నిన్న తెలుగు బిగ్ బాస్ లో విన్నర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అది ఇప్పటికి సంచలంగానే ఉంది.. తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, కన్నడలోనూ బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రసారమవుతుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బిగ్‌బాస్ రియాల్టీ షో.. స్నేహితులను చేస్తుంది.. ప్రేమికులను విడదీస్తుంది.. కానీ ఇప్పుడు బిగ్‌బాస్ ఏకంగా ఓ జంట విడాకులు తీసుకునేందుకు కారణమవుతుంది. రెండేళ్లు వైవాహిక బంధంలో బిగ్‌బాస్ గొడవలు పెట్టింది..
ఏకంగా హౌస్ లోనే విడాకులు తీసుకోబోతున్నట్లు చెప్పారు.. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా.. బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే.. విక్కీ జైన్.. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ కు వెళ్లారు.. పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయిన నటి. అదే సమయంలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం, బ్రేకప్ తో నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తుంది.. అంకితా లోఖండే డిసెంబర్ 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇద్దరూ కలిసి బిగ్ బాస్ 17 హౌస్‌లోకి అడుగుపెట్టారు..
Also Read
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్‌ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
- Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్‌కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తన భార్య అంకితా పట్ల విక్కీ చిన్నచూపు చూడడం.. ఇతర కంటెస్టెంట్స్ అందరి మధ్య తన భార్యను అవమానించడంపై విక్కీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన భర్త విక్కీని విడాకులు కావాలని కోరింది.. లేటెస్ట్ ఎపిసోడ్ లో విక్కీ మాట్లాడుతూ వివాహితుడు ఎదుర్కొనే బాధల గురించి సరదాగా చెప్పాడు. దీంతో అంకితా బాధపడింది. వైవాహిక జీవితం ఎందుకు సరిగ్గా లేదని అంకితా తన భర్తను అడగ్గా.. పెళ్లి తర్వాత పురుషులు ఎన్ని బాధలు భరిస్తున్నారో.. ఎలా అనిపిస్తుందో ఎప్పుడూ బయటకు చెప్పలేరు అని అన్నాడు. దీంతో అంకితా అతడిని విడాకులు కోరింది. బిగ్ బాస్ షో అనంతరం తన భర్తతో కలిసి ఇంటికి వెళ్లాలని కోరుకోవడం లేదని.. తన భర్త నుంచి విడాకులు కావాలని కోరింది. ఇది విన్న అందరు షాక్ అయ్యారు.. మొత్తానికి ఈ షో వల్ల విరిద్దరూ విడిపోతున్నారని విమర్శలు అందుకుంటుంది బిగ్ బాస్..
- Tags
తాజావార్తలు
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్‌ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..