NTV Telugu Site icon

Bigg Boss Adi Reddy : మరో బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్‌బాస్ ఆదిరెడ్డి.. గెస్ట్ గా బిగ్ బాస్ విన్నర్..

Bigg Boss Adireddy

Bigg Boss Adireddy

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి అందరికీ తెలుసు.. నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫెమస్ అయ్యాడు.. నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ లో రివ్యూలు, వీడియోలు పోస్టుచేసేవాడు.. బిగ్ బాస్ పై ఆదిరెడ్డి రివ్యూ లు చెప్తూ జనాలను ఎంటర్టైన్ చేశాడు.. అలా పాపులారిటిని సంపాదించాడు.. ఆదిరెడ్డికి బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మారిపోయింది. ఆ షోతో స్టార్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సెలెబ్రిటీ హోదా తెచ్చుకొని యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. అలా యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తున్న విషయాన్ని కూడా చెప్పాడు.. తాజాగా ఆదిరెడ్డి ఓ కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు.. విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గెస్ట్ గా వచ్చాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

ఇక సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా గతంలో బార్బర్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదిరెడ్డి సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాహుల్ వెళ్లడంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ఓపెనింగ్ కార్యక్రమం ఫోటోలు ఆదిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా కోసం విజయవాడ వచ్చి సెలూన్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ రాహుల్ సిప్లిగంజ్ అన్న. నా లైఫ్ లో ఇది మొదటి బిజినెస్. దీని వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం 15 మందికి వర్క్ ఇస్తున్నాము, దానికి చాలా సంతోషంగా ఉంది అని ఎమోషనల్ పోస్ట్ చేశాడు.. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే త్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ను అందుకున్నారు..