NTV Telugu Site icon

Bigg Boss 8 Telugu: ఫుడ్ కోసం ఏంట్రా బాబు అలా.. నామినేషన్స్‭తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్..

Bigg Boss 8

Bigg Boss 8

Bigg Boss 8 Telugu: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ రెండవ వారంలోకి అడుగు పెట్టింది. మొదటి వారంలో బిగ్ బాస్ నుండి బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో కాస్త భయం పెరిగిందని చెప్పవచ్చు. దాంతో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ వారి కన్నా స్ట్రాంగ్ గా అనిపిస్తున్న వారిపై నామినేషన్స్ వేస్తూ.. ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా మంగళవారం నాడు రెండో వారం సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది.

Viral Video : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అద్దాలను సుత్తితో కొట్టిన యువకుడు ఎవరో తెలిసిందోచ్

మరోవైపు నామినేషన్ చేసేంతవరకు నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధం చేసిన హౌస్ మెట్స్ ఫుడ్ కోసం మాత్రం తెగ హడావిడి చేసేసారు. ఇక ఫుడ్ ఉండదని కక్కుర్తి పడి మరి తెగ తినేసారు. ప్రస్తుతం ఇది కాస్త ట్రోల్స్ గా సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ఇకపోతే రెండో వారం సంబంధించి నామినేషన్స్ లో ఆదిత్య, నిఖిల్, మణికంఠ, పృద్వి, సీత, శేఖర్ భాష, నయనిక, విష్ణుప్రియలు నామినేట్ కాబడ్డారు. ఇదిలా ఉండగా కంటెస్టెంట్స్ కు ఇచ్చిన రేషన్ మొత్తం బిగ్ బాస్ లాగేసుకున్నాడు. ఇకపై కంటెస్టెంట్లు ఏం తినాలన్నా.. లేదా వండుకోవాలన్న.. వారు స్వంతంగా సంపాదించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇక మంగళవారం నాడు ఎపిసోడ్ నామినేషన్ తో మొదలైంది.

Baby Girl Sale: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కలకలం.. రూ.1.90 లక్షలకు చిన్నారి విక్రయం..

సీత, సోనియా వార్ ఓ రేంజ్ లో జరిగింది. అలాగే ఆదిత్య, మణికంఠ ,శేఖర్ భాషలు కూడా చిన్న పాయింట్ తీసుకొని హౌస్ మేట్స్ ను నామినేట్ చేశారు. ఇలా ఒకరిని ఒకరు ఏదో ఒక రీజన్ తో నామినేట్ చేస్తూ చివరికి ఒక్క యస్మి తప్పించ్చి మిగతా అందరూ నామినేషన్ లో ఉన్నారు. ఇక నామినేషన్ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి తీపి కబురు తెలిపాడు. అదేంటంటే.. కంటెస్టెంట్స్ అందరి కోసం బిగ్బాస్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ పంపించాడు. ఆటకు కొద్ది సమయం గ్యాప్ ఇచ్చి.. మీకు ఈరోజు ఏమి కావాలన్నా తినండి.. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నామని చెప్పగానే.. హౌస్ మేట్స్ అందరూ ఫుడ్ తినడానికి ఒకరి మీద ఒకరు పడిపోయేంత పని చేశారు. ఈ ప్రపంచంలో చాలామంది సోషల్ మీడియాలో తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఫుడ్డు కోసమే వీళ్ళు బిగ్ బాస్ వెళ్లినట్లుగా ఆ కకృతి ఏంట్రా అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

Show comments