Bigg Boss Elimination: బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. కాగా 11వ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని ముందు నుంచి వినిపిస్తుంది. ఈవారంలో విష్ణు ప్రియ, పృథ్వీ, యష్మీ, గౌతమ్, టేస్టీ తేజా, అవినాష్.. ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. గత వారం యష్మీ గౌడ ఎలిమినేషన్ అంచుల వరకూ వెళ్లి సేవ్ అయ్యింది. గత వారమే యష్మీకి లీస్ట్ ఓటింగ్ పడింది. అయితే హరితేజకు ఆమె కంటే తక్కువ ఓటింగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. యష్మీ గౌడ సేవ్ అయ్యింది. అయితే 11వ వారంలో మళ్లీ యష్మీ గౌడ నామినేషన్స్‌లోకి రావడంతో.. ఇక ఈమె ఎలిమినేషన్ పక్కా అనుకున్నారు. అయితే ఆమెకి అదృష్టం కలిసి వచ్చి.. నిఖిల్ నామినేషన్స్‌లోకి రాకుండా పోయాడు. అయితే నిఖిల్ అభిమానులు భారీగా ఓట్లు కన్నడ బ్యాచ్‌కి షిఫ్ట్ చేయడంతో.. ఈవారం కూడా కన్నడ బ్యాచ్ కాకుండా తెలుగు వాళ్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న అవినాష్‌ని ఎలిమినేట్ చేశారని తెలుస్తోంది.
Read Also:Jayam Ravi : దీపావళి డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
11వ వారంలో బిగ్ బాస్ హౌస్‌కి మెగా చీఫ్ అయ్యాడు అవినాష్. అతను రెండోసారి మెగా చీఫ్ కావడమే కాకుండా.. ఎంటర్ టైన్మెంట్ పరంగా.. టాస్క్‌ల పరంగా జనాలను ఆకట్టుకుంటున్నాడు. అయితే అనూహ్యంగా 11వ వారంలో అవినాష్‌ని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ టీం. ప్రస్తుతం ఈ 11వ వారంలో అవినాష్ మెగా చీఫ్‌గా ఉన్నాడు. మెగా చీఫ్‌గా ఉండి ఎలిమినేట్ కావడం అనేది బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటి వరకూ జరగలేదు. ఈవారం మెగా చీఫ్ కావడం వల్ల.. అవినాష్‌ని వచ్చే వారం నామినేషన్స్ నుంచి ఇమ్యునిటీ కూడా లభించేది. నేరుగా 13వ వారం వరకూ ఢోకా ఉండేది కాదు.
Read Also:VVS Laxman: సూర్య సూపర్.. ఆ ఇద్దరికి ఎదురేలేదు: లక్ష్మణ్
అవినాష్ ఎలిమినేట్ అయిపోయినా కూడా.. అతడిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ నబీల్ చేతిలో ఉంది. తక్కవు ఓటింగులలో ఉన్న విష్ణు ప్రియ, అవినాష్‌లు ఉంటే.. ఖచ్చితంగా నబీల్‌ని తన ఎవిక్షన్ షీల్డ్‌ని ఉపయోగిస్తావా? లేదా? అని నాగార్జున అడిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గనుక నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌ని ఉపయోగిస్తేగనుక.. ఎలిమినేట్ అయిన అవినాష్ సేవ్ అయినట్టే. తాజా సమాచారం ప్రకారం.. నబీల్‌ని తన ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించి అవినాష్‌ని సేవ్ చేయడంతో ఈవారం నో ఎలిమినేషన్ ప్రకటించినట్లు తెలుస్తోంది.