NTV Telugu Site icon

Bigg Boss 7Telugu: నాలుగు వారాలకే రతిక ఔట్‌.. ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

Rathika

Rathika

బిగ్ బాస్ నాలుగో వారం అనుకున్న విధంగానే రతికా ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. నాలుగో వారం అత్యంత తక్కువ ఓటింగ్ తో రతిక, తేజ లు మిగిలారు.. అయితే, రతికా అనూహ్యంగా బయటకు వచ్చేసింది.. ఒకనొక దశలో టైటిల్‌ ఫేవరెట్‌గా భావించిన రతిక అనూహ్యంగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. ఇదంతా ఆమె చేతులరా చేసుకున్నదే. తన ప్రవర్తనకు తోడు ఓట్లు తక్కువ రావడంతో నాలుగో వారంలోనే హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది రతిక. కాగా నాగ్‌ ఎలిమినేట్‌ అని ప్రకటించగానే రతిక ఎమోషనల్‌ అయ్యింది.. తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో తెలియదు అంటూ కాసేపు షాక్ లో ఉండిపోయింది..

నేను ఎలిమినేట్ అవ్వడం కలగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది.. అందరిలాగే అమ్మడు కూడా హౌస్ మేట్స్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. నాలుగో వారంలోనే బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన రతిక రెమ్యునరేషన్‌ మాత్రం గట్టిగానే తీసుకుందట. రోజుకు 28 వేలు, ప్రతివారం 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం నాలుగు వారాలకు కలిపి రూ. 8 లక్షల పారితోషకం అందుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..మరికొన్ని రోజులు హౌజ్‌లో ఉండి ఉంటే రతిక మరింత మొత్తం తీసుకునేదేమో. అయినా ఇంత త్వరగా ఎలిమినేట్‌ అయినప్పటికీ గట్టిగానే రెమ్యునరేషన్‌ అందుకుందని జనాలు అనుకుంటున్నారు..

ఈ సీజన్ లో మొత్తం మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అందులో రతికా రోజ్‌ ఆరంభంలోనే అందరి చూపును తన వైపునకు తిప్పుకునేలా చేసింది. తన గ్లామర్‌తోనూ కట్టిపడేసింది. పల్లవి ప్రశాంత్‌తో ప్రేమగా మాట్లాడుతూ జనాల మనసు చూరగొంది. అయితే అదంతా ఆటలో భాగమేనని త్వరగానే అర్ధమైపోయింది.. ఆ తర్వాత ప్రిన్స్ తో ప్రేమగా ఉంది..అతనితో కూడా గొడవపడి వదిలేసింది.. మొత్తానికి తన గ్లామర్ తో ఈ అమ్మడు బాగానే ఆకట్టుకుంటుంది.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా నటించింది.. ఇక ఇప్పుడు సినిమాల పై ఫోకస్ పెడుతుందని తెలుస్తుంది.. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..