Site icon NTV Telugu

New GST: సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. అమల్లోకి జీఎస్టీ 2.o.. వీటి రేట్లు తగ్గాయి..

Gst

Gst

వన్ నేషన్‌-వన్ ట్యాక్స్‌..! జీఎస్టీ మెయిన్‌ కాన్సెప్ట్‌ ఇదీ. పేరుకు ఒకటే ట్యాక్స్ అయినా ఇందులో నాలుగు శ్లాబులు ఉండేవి. 5, 12, 18, 28శాతం ఇలా ఉండేవి. ఐతే జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా పాత శ్లాబులను రెండింటికి కుదించారు. 5, 18 శ్లాబులను ఉంచి మిగితావి రద్దు చేశారు. ఐతే 40శాతం ఉన్నా, ప్రధానంగా రెండు శ్లాబులు మాత్రమే కన్పిస్తాయి. ఇందులో పేదలు, సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ఇవాళ్టి నుంచి నిత్యవసరాల వస్తువులు భారీగా తగ్గుతాయి. మనం ఇంట్లో వాడే వస్తువుల రేట్లు దిగివచ్చాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్‌లు, షేవింగ్ క్రిమ్స్ పై 18శాతం వున్న జీఎస్టీని 5 శాతానికి తగ్గింది. ఇక గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, న్యాప్ కిన్స్, కెమికల్ డైపర్స్,కుట్టు మిషన్లు గతంలో 12శాతం ఉండగా ఇప్పుడు 5 శాతంలోకి వచ్చాయి. ఇతర గృహావసర వస్తువులు ఇప్పటివరకు 12, 18, 28 శాతం ఉండగా, ఇవాళ్టి నుంచి 5 శాతం మాత్రమే ట్యాక్స్‌ ఉంటుంది.

Read Also Tamannaah : ఇన్నర్ వేర్ కనిపించేలా రెచ్చిపోయిన తమన్నా పై ఫ్యాన్స్ ఫైర్..

ఆహార పదార్థాల ధరలూ దిగివచ్చాయి. ఇప్పటివరకు 5 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీని ఎత్తివేశారు. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పనీర్, రోటీ, చపాతి, పరోటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు జీరో ట్యాక్స్ శ్లాబ్ లోకి వచ్చాయి. ఉప్పు, సాస్‌లు, పాస్తా, నూడుల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వచేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటి పన్నును ఐదు శాతానికి తగ్గించారు. ఇక హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‎ పాలసీలపై జీఎస్టీ మొత్తానికే రద్దు చేశారు. దాంతో ఒక్కో పాలసీపై 2 నుంచి 3 వేలు రూపాయలు తగ్గుతుంది. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని రద్దు చేశారు. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించారు. థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డియాగ్నస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్ ,టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5శాతానికి కుదించారు.

మొబైల్ ఫోన్లు, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్ల ధరలు కూడా దిగొచ్చాయి. 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీని తగ్గించారు. ఇల్లు నిర్మించుకునేవారికి కాస్త రిలీఫ్ దక్కనుంది. సిమెంట్‌పై ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గింది. ఇక మార్బుల్‌, గ్రానైట్‌పై 5 శాతానికి జీఎస్టీని కుదించారు. దాంతో రేట్లు తగ్గి సామాన్యులకు ఊరట దక్కనుంది. ఇటు రైతులకు పెట్టుబడి భారం తగ్గనుంది. ఎరువులపై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ట్రాక్టర్లు, స్పేర్ట్స్ పార్ట్స్, డ్రిప్ ఇరిగేషన్ స్ర్పింకర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై 12 శాతం నుంచి 5 శాతనికి జీఎస్టీ తగ్గించారు. ఇక వాహనాల విషయానికి వస్తే చిన్న కార్లు, 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లు 18 శాతం శ్లాబులోకి తీసుకువచ్చారు. త్రీ వీలర్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. వస్తు రవాణా చేసే మోటారు వాహనాలు, అన్ని రకాల ఆటో విడిభాగాలు 28 శాతం నుంచి 18శాతానికి తీసుకొచ్చారు. ఐతే మీడియం,లగ్జరీ కార్లపై మాత్రం ప్రీమియం ట్యాక్స్ పడబోతోంది. ఆయా కార్ల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాల రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. వీటిపై 40 శాతం జీఎస్టీ వేశారు.

Exit mobile version