NTV Telugu Site icon

500 Note: రూ.500 నోటు గురించి బిగ్ న్యూస్.. అసలు విషయాన్ని బయటపెట్టిన PIB..!

500 Notes

500 Notes

500 Note: 500 రూపాయల నోటుకు సంబంధించి గత కొన్నిరోజులుగా పెద్దపెద్ద వార్తలు వస్తున్నాయి. 2000 నోట్ల రద్దు కారణంగా మార్కెట్‌లో నకిలీ నోట్లు సంచరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఇదిలా ఉంటే రూ.500 నోట్లకు సంబంధించి అనేక రకాల ఫేక్ మెస్సేజ్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంతకంపై ఓ మెస్సెజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఫేక్ నోట్లపై PIB ఫ్యాక్ట్ చెకర్ నిజాన్ని బయటపెట్టింది.

Read Also: Gold Seize: బీఎండబ్ల్యూ కారులో మ్యాట్ కింద 12 కేజీల బంగారం.. విలువ రూ.7కోట్లు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెస్సెజ్ లో 500 రూపాయల నోటును తీసుకోవద్దని, అందులో ఆకుపచ్చ స్ట్రిప్‌ను ఆర్‌బిఐ గవర్నర్ సంతకం దగ్గర కాకుండా గాంధీజీ చిత్రం దగ్గర ఉంచాలని పేర్కొంది. అయితే ఆ మెసేజ్ వైరల్ కావడంతో జనాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఈ విషయం పూర్తిగా ఫేక్ అని తేలింది. దీంతో మీరు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు మెస్సేజ్ లను నమ్మొద్దని తెలిపింది.

Read Also: Loksatta: ఓటర్ల తొలగింపుపై ‘ఓట్ ఇండియా-సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో లోక్‌సత్తా ప్రత్యేక కార్యక్రమం

అయితే ఫేక్ నోట్ల ప్రచారంపై ఆర్బీఐ, పీఐబీ స్పష్టమైన వివరణ ఇచ్చాయి. రూ.500 నోట్లలో రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయని.. ఆకతాయిలు చేసే ఫేక్ మెస్సేజ్ లను పట్టించుకోవద్దని సూచించింది. ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారిని పట్టుకుంటామని.. ఇకపై నుండి ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోవద్దని.. అంతేకాకుండా గందరగోళానికి గురికావద్దని పీఐబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Show comments