Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఒక కెప్టెన్, నలుగురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir : స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు.. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ సమయంలో భారత సైన్యానికి చెందిన 48 నేషనల్ రైఫిల్స్‌కు చెందిన ఒక కెప్టెన్ వీరమరణం పొందాడు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక పౌరుడు కూడా గాయపడ్డాడు. మరో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. శివగఢ్-అస్సార్ బెల్ట్‌లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో రక్తపు మరకలు ఉండడంతో కాల్పుల్లో ఓ ఉగ్రవాది గాయపడి ఉండొచ్చని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి భద్రతా బలగాలు ఒక ఎం4 కార్బైన్, మూడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నాయని వర్గాలు తెలిపాయి.
Read Also:Home Minister Anitha: అందుకే రాజకీయ హత్యలు.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఉధంపూర్ జిల్లాలోని పట్నితోప్ ప్రాంతానికి సమీపంలోని అకర్ అడవుల్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భావిస్తున్నామని, ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని ఆయన చెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్న ఒక ఉన్నత స్థాయి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభం కావడం గమనార్హం. భారత సైన్యం ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ అస్సార్ అని పేరు పెట్టింది.
Read Also:DoubleISMART; డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?
మంగళవారం తెల్లవారుజామున, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో వరుసగా నాలుగో రోజు కూడా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగాయి. మంగళవారం తెల్లవారుజామున అహ్లాన్ గగర్మండు అటవీప్రాంతంలో కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలను సెర్చ్ పార్టీలు గమనించి, వారి ఆచూకీ కోసం కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు అదనపు భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బిర్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఆగస్ట్ 10న అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా, కోకెర్నాగ్ బెల్ట్‌లోని అహ్లాన్ గగర్మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారీ సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించబడింది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!