NTV Telugu Site icon

Congress: హస్తానికి మాజీ సీఎం భార్య ఝలక్.. బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎంపీ

Ex Cm Wife

Ex Cm Wife

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఇటీవలే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్‌ చవాన్ కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి (BJP) చేరారు. తాజాగా అదే వరుసలో మరో మాజీ సీఎం భార్య, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ చేశారు.

జార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి మధు కోడ భార్య, సింగ్భూమ్ కాంగ్రెస్ ఎంపీ గీతా కోడ (Geeta Koda) కాంగ్రెస్‌కు (Congress) ఝలక్ ఇచ్చారు. సోమవారం ఆమె జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

గీతా కోడ ప్రస్తుతం సింగ్భూమ్ (Singhbhum) కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పొత్తులపై గీతా కోడ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె తన రాజీనామాను పార్టీ అధిష్ఠానానికి పంపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో గీతా కోడ పార్టీ మారడం కాంగ్రెస్‌కు దెబ్బగా భావిస్తున్నారు.

ప్రస్తుతం జార్ఖండ్‌లో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. హేమంత్ సోరెన్‌ మనీలాండరింగ్ కేసులో జైలు కెళ్లాక.. ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ కూడా కాంగ్రెస్‌కు మింగుడుపడడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. తాజాగా సింగ్భూమ్ ఎంపీ గీతా కోడ పార్టీని వీడడం హస్తానికి గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి.