Robbery Case: మొదట బీదర్, తర్వాత అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో రోజురోజుకి ఒక కీలక సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల నేపథ్యంలో రూ.93 లక్షలతో పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక అక్కడ కాల్పులు జరిపి డబ్బుతో ఉదయనించిన తర్వాత అనంతరం నిందితులు హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్ లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. నిందుతులని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉండగా., వారిపై కాల్పలు జరిపి రాయ్‌పూర్ వైపు పారిపోయారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు నిందితులను పట్టుకోనే ప్రయత్నామ్ జరుగుతునే ఉంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి కీలక పురోగతి అందుకుంది.
Also Read: Sankranthiki Vasthunam : ఆల్ సెంటర్స్ హౌస్ ఫుల్స్.. సింగిల్ హ్యాండ్ వెంకీ మామ
దుండగులు తిరుమలగిరి నుండి షామీర్ పేట్ వరకు ఆటోలో ప్రయాణించగా, ఆపై షామీర్ పేట్ నుండి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు నిర్ధారణ చేశారు. గజ్వేల్ నుంచి అదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితులు అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ ఘటనకు సంబంధించి అమిత్, మనీష్ అనే నిందితులను పోలీసులు గుర్తించగా.. ఈ కేసును ఛేదించడానికి హైదరాబాద్, బీదర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ను చేపట్టారు. ఇప్పటికే బీహార్‌తో పాటు జార్ఖండ్ ప్రాంతాలకు చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. రెండు రాష్ట్రాల పోలీస్ బలగాలు సమన్వయంతో నిందితుల కదలికలను పర్యవేక్షిస్తున్నాయి. దోపిడీ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నిందితుల కోసం పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.