Vijay Antony Daughter: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Hero Vijay Antony Daughter Meera Committed Suicide: తమిళ హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ కూతురు మీరా మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మీరా మృతి చెందినట్లు సమాచారం. విజయ్ ఆంటోని కూతురు మీరా వయసు 17 ఏళ్లు కాగా.. ఆమె 12వ తరగతి చదువుతున్నారు.
విజయ్ ఆంటోని కూతురు మీరా చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నారు. నివేదికల ప్రకారం.. మీరా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారట. మానసిక ఒత్తిడిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారట. దీంతో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విషయం తెలిసిన పలువురు నటులు, ఫాన్స్.. విజయ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. మీరా ఆత్మహత్యకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘రత్తం’. సీఎస్ అముదమ్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి.పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్య నంబీశన్, మహిమ నబియార్, నందిత శ్వేత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్, గోపీ అమర్నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రత్తం సినిమా అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది.
విజయ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్‌గా చాలా సినిమాలు చేశారు. సింగర్ గాను ఆయన ప్రతిభ చాటారు. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విజయ్ ఆంటోని దగ్గరయ్యారు. అంతకుముందు ఆయన పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ‘బిచ్చగాడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?