Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
- నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ
- న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు భువీ ఎంపిక
- పేస్ బౌలింగ్‌లో అనుభవం కోసమే..
- భువీని తీసుకున్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar Returns: టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం అతడిని ఎంపిక చేశారు. అంతకుముందు బెంగళూరు వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ.. మ్యాచ్ పూర్తిగా జరగకపోవడంతో భువనేశ్వర్‌కు బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. దీంతో న్యూజిలాండ్‌తో గురువారం జరిగే తొలి టీ20లోనే అతడి అసలైన కంబ్యాక్ జరగనుంది.
భువనేశ్వర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి గల కారణాన్ని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాజాగా వెల్లడించాడు. గత కొంతకాలంగా భారత బౌలింగ్ విభాగంలో అనుభవం కొరవడిందని, భువనేశ్వర్ రాకతో ఆ లోటు భర్తీ అవుతుందని మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో అయ్యర్ చెప్పుకొచ్చాడు. ‘‘భువీ రాకతో భారత పేస్ బౌలింగ్ విభాగానికి ఎంతో అనుభవం తోడైందని.. ఐపీఎల్ తర్వాత ఆ అనుభవం లోటు కనిపించిందని చెపుడించాడు. ఇంకా జట్టులోకి చాలా మంది యువ పేసర్లు వచ్చారు. భువనేశ్వర్ గత రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతంగా రాణించాడు. టీ20 ఫార్మాట్లో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలంటే ఏం చేయాలో అతడికి బాగా తెలుసు’’ అని శ్రేయస్ అయ్యర్ కొనియాడారు.
Also Read
- Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
- Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
- Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!
36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో మరోసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం దక్కింది. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టులో నలుగురు స్పెషలిస్ట్ పేసర్లతో పాటు ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ సీనియర్ బౌలర్‌గా భువనేశ్వర్ ప్రదర్శనపై ప్రత్యేకంగా దృష్టి ఉండనుంది. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడంతో పాటు డెత్ ఓవర్లలో తన అనుభవాన్ని ఉపయోగించడం టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌లో భువనేశ్వర్ ఎలా రాణిస్తాడనేది అతడి అంతర్జాతీయ కెరీర్‌కు కూడా కీలకంగా మారనుంది. న్యూజిలాండ్ పర్యటన అనంతరం భారత్ స్వదేశంలో శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
-
Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
-
ICC U19 Women’s T20 World Cup 2027: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితోంటే!
-
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!