NTV Telugu Site icon

Allowance for Unemployed: నిరుద్యోగ యువతకు శుభవార్త.. భృతిని ప్రకటించిన సీఎం

Bupesh Bhagel

Bupesh Bhagel

Allowance for Unemployed: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ.. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపారు. ఈ ఏడాది ఆఖరులో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గురువారం ఓ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలవారీ భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కీలక వాగ్దానాలలో ఇది ఒకటి. 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగదల్‌పూర్‌లోని లాల్‌బాగ్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి బఘేల్ మాట్లాడారు. రాయ్‌పూర్ విమానాశ్రయం సమీపంలో ఏరోసిటీ ఏర్పాటు, గృహనిర్మాణ సహాయం సహా పలు ఇతర ప్రకటనలు చేశారు. కార్మికుల కోసం పథకం, మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించే పథకాల గురించి ఆయన ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందని వెల్లడించారు. కానీ ఎంత మొత్తం ఇస్తారో మాత్రం చెప్పలేదు.

Republic Day 2023: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. సత్తాను చాటి చెప్పిన త్రివిధ దళాలు

రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయానికి సమీపంలో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడం, విమానాశ్రయ ప్రాంతం వాణిజ్య అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఏరోసిటీని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు మూడేళ్ల పాటు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.50 వేలు గ్రాంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.