Allowance for Unemployed: నిరుద్యోగ యువతకు శుభవార్త.. భృతిని ప్రకటించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allowance for Unemployed: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపారు. ఈ ఏడాది ఆఖరులో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గురువారం ఓ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలవారీ భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కీలక వాగ్దానాలలో ఇది ఒకటి. 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగదల్‌పూర్‌లోని లాల్‌బాగ్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి బఘేల్ మాట్లాడారు. రాయ్‌పూర్ విమానాశ్రయం సమీపంలో ఏరోసిటీ ఏర్పాటు, గృహనిర్మాణ సహాయం సహా పలు ఇతర ప్రకటనలు చేశారు. కార్మికుల కోసం పథకం, మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించే పథకాల గురించి ఆయన ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందని వెల్లడించారు. కానీ ఎంత మొత్తం ఇస్తారో మాత్రం చెప్పలేదు.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
Republic Day 2023: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. సత్తాను చాటి చెప్పిన త్రివిధ దళాలు
రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయానికి సమీపంలో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడం, విమానాశ్రయ ప్రాంతం వాణిజ్య అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఏరోసిటీని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు మూడేళ్ల పాటు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.50 వేలు గ్రాంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?