NTV Telugu Site icon

Bhupendra Patel: గుజరాత్ శాసన సభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవ ఎన్నిక

Bhupendra Patel

Bhupendra Patel

Bhupendra Patel: గుజరాత్ శాసన సభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫలితంగా భూపేంద్ర పటేల్‌ వరుసగా రెండోసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూపేంద్ర నేతృత్వంలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.మొత్తం 182 స్థానాలకుగాను 156 చోట్ల జయభేరి మోగించి వరుసగా ఏడోసారి అధికారం చేపట్టనుంది.

నివేదికల ప్రకారం, పార్డో ఎమ్మెల్యే కను దేశాయ్ తన పేరును ప్రతిపాదించగా.. దీనికి ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ ముండా కూడా ఈ సమావేశంలో కేంద్ర పరిశీలకులుగా పాల్గొన్నారు. భూపేంద్ర పటేల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లకు అధికారిక ఆహ్వానాలు అందజేయనున్నారు.

Himachal Pradesh: సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రియాంకదే తుది నిర్ణయం!

సమావేశానికి ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే హార్దిక్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, రాబోయే 5-10 ఏళ్లలో గుజరాత్ ఎలా బలపడుతుందో చూడాలన్నారు. మంత్రివర్గంలో స్థానం గురించి ప్రశ్నించగా.. తాను మొదటి నుంచి సైనికుడి పాత్ర పోషిస్తున్నానని.. పార్టీ తనకు ఏ పార్టీ అప్పగించినా తాను అంగీకరిస్తానన్నారు.