NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: తప్పు చేస్తే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుంది..

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. తిరుమలలో అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కల్తీ నెయ్యి వివాదం పై అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తాను తప్పు చేసి వుంటే తన కుటుంబం సర్వనాశమవుతుందంటూ కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో కరుణాకర్ రెడ్డిని పోలీసులు పక్కకు లాగేశారు. అంతకు ముందు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని కరుణాకర్ రెడ్డితో పోలీసులు సంతకం తీసుకున్నారు.

Read Also: Pawan Kalyan: ఏపీలో చేపట్టిన బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

 

Show comments