24 గంటల పాటు అన్నదానం సాగె దివ్యక్షేత్రం కాశినాయన క్షేత్రం అని, అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్‌తో కూలగొట్టిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బుల్డోజర్‌తో కాశినాయన క్షేత్రంను కూల్చారన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే సీఎం చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగిందన్నారు. నిరసన, తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి నారా లోకేష్ తానే కట్టిస్తా అన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు భద్రత లేదు, సనాతన ధర్మానికి రక్షణ లేదు అని భూమన ఫైర్ అయ్యారు.
’24 గంటల పాటు అన్నదానం సాగె దివ్యక్షేత్రం కాశినాయన క్షేత్రం. అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్‌తో కూలగొట్టింది. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బుల్డోజర్‌తో కాశినాయన క్షేత్రంను కూల్చారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే సీఎం చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగింది. నిరసన, తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిపై నారా లోకేష్ స్పందించి నేనే కట్టిస్తా అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి పవనానంద తీర్థ స్వామీజీ దీనికి సమాధానం ఏం చేబుతారు?. టైగర్ జోన్‌లో ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం విడ్డూరం, టైగర్ జోన్‌లో ఉన్న శ్రీశైల మల్లన్న దేవాలయాన్ని కూల్చివేస్తారా?. ఈ కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు భద్రత లేదు, సనాతన ధర్మానికి రక్షణ లేదు’ అని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
‘వైసీపీ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నిర్భయంగా ప్రకటన చేశారు. కేవలం వైసీపీ పైన బలమైన ఆరోపణలు చేయాలని ప్రజలపై రుద్దారు. శ్రీవారి ఆలయం వద్ద తాగబోతూ హల్చల్ చేయడం హిందూ ఆలయాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తెలుస్తోంది. తిరుమలలో మూడు సార్లు ఎర్ర చందనం పట్టుకున్నారు. కాశినాయన క్షేత్రంపై దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎన్టీఆర్ శవాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నిలబడింది లోకేష్. ఎన్టీఆర్ ను మానసికంగా వేధించి టీడీపీని లాక్కున్నాడు చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో ఉండటం వల్లే బీజేపీ నోరు మెదపడం లేదు?’ అని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.