YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ చాలా మంది పార్టీలు మారుతున్నారు. అధికార వైసీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ఛార్జి భూమా కిషోర్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు. భూమా కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నేతలు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Also: Kodali Nani: జన సైనికులే చంద్రబాబును పాతాళానికి తొక్కేస్తారు..