Bhumana Karunakar: తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీ విజయం సాధించేది కాబట్టి, కూటమి గెలిచే పరిస్థితి లేదని భావించి, ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతున్నాం అని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, టీడీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల అధికారి టీడీపీ అనుకూలంగా పనిచేశారని చెప్పిన ఆయన, కిడ్నాప్ అయిన కార్పొరేటర్లను తీసుకోవాల్సిన బాధ్యత ఎస్పీ మీద ఉందా? అని ప్రశ్నించారు. తిరుపతి ఎమ్మెల్యే మదన్ గూండాయిజం చేస్తూ రాజకీయ క్షోభను సృష్టించారని ఆయన ఆరోపించారు.
Also Read: AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
తిరుపతిలో చోటుచేసుకున్న దౌర్జన్యాలు, బెదిరింపులు, గూండాయిజం గురించి మాట్లాడిన భూమన, మా పార్టీ తరపున గెలిచిన 48 కార్పొరేటర్లలో కొందరిని బెదిరించి, భయపెట్టి లాక్కున్నారని అన్నారు. ఉమా, శేఖర్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి ఆస్తులపై దాడి చేసిన మంత్రి తిరుపతిలో ఈ దౌర్జన్యాలకు పునాది వేశారని ఆయన పేర్కొన్నారు. కూటమి నేతలపై దాడులు చేసినట్లు, అలాగే కార్పొరేటర్లను బెదిరించి, బస్సులో వెళ్ళిన వారిని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. నలుగురు కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారో, ఏమి అయ్యారో తెలియదని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. చిత్తూరులో ఉన్న మా కార్పోరేటర్లను ఎమ్మెల్యే కోడుకు మదన్ ,ఆయన అనుచరులు ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తూ బెదిరించారని ఆయన అన్నారు. బస్సులో వెలుతున్న కార్పోరేటర్లను అన్నా రామచంద్రా యాదవ్ అనే ఆకు రౌడితో కోట్టి కిడ్నాప్ చేశారని ఆయన అన్నారు. నలుగురు కార్పోరేటర్ల ఎక్కడ ఉన్నారో ..ఎమీ అయ్యారో తెలియదని వాపోయారు. ఈ వ్యాఖ్యలతో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో జరుగుతున్న దౌర్జన్యాలను బహిరంగంగా ఆరోపించారు. ఈ పరిణామాలు తిరుపతిలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి.