NTV Telugu Site icon

Bhuma Jagat Vikhyat Reddy: భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. అక్కడి నుంచే బరిలోకి..!

Bhuma Jagat Vikhyat Reddy

Bhuma Jagat Vikhyat Reddy

Bhuma Jagat Vikhyat Reddy: భూమా దంప‌తుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. నంద్యాల నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని ప్రకటించారు.. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డపైనే ఫోకస్ పెట్టమని పార్టీ అధిష్టానం చెప్పిందన్నారు.. అయితే, తన తండ్రి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాణాలు విడిచిన నంద్యాల నుండే తాను పొలిటికల్ కెరీర్ ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. కానీ, తనను నంద్యాలలో తిరగవద్దని పార్టీ చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు.. నంద్యాల నియోజకవర్గంలోని ప్రతి వార్డు, గ్రామంలో పర్యటిస్తాను అని ఈ సందర్భంగా ప్రకటించారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.

Read Also: Jio 3GB Recharge Plans: రిలయన్స్ జియో స్పెషల్ ప్లాన్స్.. ప్రతిరోజూ 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

కాగా, తాను నంద్యాల అసెంబీ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నట్టు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.. మా నాన్నలా నేను కూడా ఇక్కడి నుంచే రాజకీయం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఏమాట మాట్లాడినా ఆలోచించే మాట్లాడతాను.. నేను మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది అంతేగాని గాలి మాటలు అలవాటులేదని… గ్రౌండ్ లెవెల్ లో ఎవరికి సత్తా ఉంటే.. కార్యకర్తలకు భరోసా ఇవ్వగలిగితే వారికే టిక్కెట్ వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన విషయం విదితమే.. అంతేకాకుండా టీడీపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపుకోసం పనిచేస్తా. టీడీపీ కార్యకర్తలు ఎక్కడికి వెళ్లినా భరోసా ఉండాలని జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.