NTV Telugu Site icon

Bhuma Akhila Priya: అన్ని లెక్క రాసుకుంటున్నాం.. ఎవరిని వదిలిపెట్టేది లేదు..

Akila Priya

Akila Priya

Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘రా కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సభలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో రాక్షసులు భయపడేలా పాలన ఉందని ఆరోపించారు. హిట్లర్ కూడా ఈ పాలన చూసి భయపడతారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పని లేదని భూమా అఖిలప్రియ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో గూండాల్ని తయారు చేశారని మండిపడ్డారు. గుండాలను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని అఖిలప్రియా దుయ్యబట్టారు.

Read Also: Nara Bhuvaneshwari: చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబానికి భువనేశ్వరి ఆర్థికసాయం..

అన్ని లెక్క రాసుకుంటున్నాం.. ఎవరిని వదిలిపెట్టేది లేదని అఖిల ప్రియ హెచ్చరించారు. తాను, తన భర్త జైలులో ఉంటే.. తన కొడుకుని చూడడానికి జడ్జి రోజుకు ఒక గంట టైం ఇచ్చారు.. జైలులో ఉండగా తన కొడుకు ఏడుపు ఇప్పటికి గుర్తుందని అఖిల ప్రియ చెప్పారు. అవన్నీ గుర్తున్నాయి.. టీడీపీ అధికారంలోకి రాగానే లెక్కలు తేలుస్తామన్నారు. నంద్యాల నుంచి వైసీపీ పతనం మొదలవుతుందని అఖిలప్రియ ఆరోపించారు. మరోవైపు.. ఆళ్లగడ్డలో తాగడానికి నీళ్లు లేకుంటే చెరువుకు నీళ్లు వదులుకొని ఎమ్మెల్యే తల్లి అందులో చేపలు పడుతుందట అని విమర్శించారు. ఈ ప్రభుత్వం కేసి కెనాల్ కు నీళ్లు వదలలేదని అఖిలప్రియ మండిపడ్డారు.

Read Also: BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. జీతం ఎంతంటే?