NTV Telugu Site icon

Bhopal Blast: మధ్యప్రదేశ్‌లో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. అగ్నికి ఆహుతైన 50 ఇళ్లు

Mp Fire

Mp Fire

Explosion Blast: మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా సమీపంలోని మగర్ధ రోడ్డులో ఉన్న అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో బాణసంచా తయారీకి ఉంచిన గన్‌పౌడర్‌కు తాకడంతో మంటలు కొద్దిసేపటికే భారీ రూపం దాల్చాయి. సమీపంలోని 50కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొని అక్కడికి పరుగులు తీశారు. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

Read Also: Minister Botsa: డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక భేటీ

ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు.. పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలం దగ్గర పోలీసు బలగాలను మోహరించాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో బారికేడ్లు వేసి సామాన్య ప్రజల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాడు.