NTV Telugu Site icon

Bhoot Jolokia : ఘోస్ట్ పెప్పర్.. ఒక్కటంటే ఒక్క మిర్చి నమిలారో ఇక అంతే

Bhoot Jolokia

Bhoot Jolokia

Bhoot Jolokia : ఎర్ర మిరపకాయలు ఆహారంలో ఘాటు కోసం వాడుతుంటాం.. కూరలలో కారం వేయడం వల్ల దాని రుచి పెరుగుతుంది. దీనితో పాటు కూర రంగు కూడా ఎర్రగా మారుతుంది. భారతదేశం అంతటా ఎర్ర మిరప విరివిగా సాగు చేస్తారు. కానీ నాగాలాండ్ భూత్ జోలోకియాలో పండే ఎర్ర మిరపకాయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హాట్ చిల్లీ హాపెన్స్‌లో భూత్ జోలోకియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయింది. భూట్ జోలోకియా ఇది ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయ. దీనినే ఘోస్ట్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇది మెక్సికన్ రెడ్ సవినా కంటే రెట్టింపు కారం ఉంటుంది. ఇది మామూలు మిర్చి కారపు పొడి కంటే మూడు రెట్లు ఎక్కువ కారంగా ఉంటుంది.

Read Also: Malavika Sreenath : గదిలోకి వెళ్లగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక

భూత్ జోలోకియా నాగాలాండ్‌లోని ప్రసిద్ధ ఎర్ర మిరప. ఇది విత్తిన 75 నుండి 90 రోజుల తర్వాత మాత్రమే పంట చేతికి వస్తుంది. భుట్ జోలోకియా మిరపకాయ చెట్టు ఎత్తు 50 నుండి 120 సెం.మీ వరకు ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో మాత్రమే దీనిని సాగు చేస్తారు. భూట్ జోలోకియా మిరపకాయలు సాధారణ ఎర్ర మిరపకాయల కంటే పొడవు తక్కువగా ఉంటాయి. దీని పొడవు 3 సెం.మీ వరకు ఉంటుంది, వెడల్పు 1 నుండి 1.2 సెం.మీ.

ఈ మిరపకాయను పెప్పర్ స్ప్రే తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ స్ప్రేతో మహిళలు తమను తాము రక్షించుకుంటారు. పెప్పర్ స్ప్రేని పిచికారీ చేసినప్పుడు, ప్రజల గొంతు, కళ్ళలో మంట మొదలవుతుంది. 2007లో భూత్ జోలోకియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. నాగాలాండ్‌లో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. కావాలంటే ఇంటి లోపల కుండీలో కూడా పెంచుకోవచ్చు.

Read Also: Save The Tigers: పిల్లిగా మారిన పులి లాంటి భర్తల కథ!

2008 సంవత్సరంలో భూత్ జోలోకియా GI ట్యాగ్‌ని పొందింది. GI టాక్ అనేది భౌగోళిక సూచన. GI ట్యాగ్ ద్వారా కస్టమర్ తాను కొనుగోలు చేస్తున్న వస్తువు ఏ ప్రదేశం నుండి సంబంధించినదో తెలుసుకుంటారు. GI ట్యాగ్ పొందడమంటే ఆ వస్తువు బ్రాండ్ విలువ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆ పంటను సాగుచేసిన రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే డిమాండ్ పెరిగినప్పుడు.. రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తారు. భూట్ జోలోకియా మిరపకాయకు యూరప్‌లో కూడా చాలా డిమాండ్ ఉంది. 2021లో జోలోకియా మిర్చి లండన్‌కు ఎగుమతి చేయబడింది. భూత్ జోలోకియా పంట ఎక్కువ వర్షాన్ని తట్టుకోలేదు. భారీ వర్షాలు కురిస్తే అది చెడిపోతుంది.