ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భోళా శంకర్’ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుండగా, అభిమానులు, సినీ ప్రేక్షకులలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య సినిమా తర్వాత చిరంజీవిది ఇది రెండో చిత్రం.
Also Read : Harish Rao : హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నాలుగు 1000 పడకల టిమ్స్ ఆస్పతులు
అజిత్ నటించిన వేదాళంకు ఇది రీమేక్. చిరు ఈ రీమేక్‌కు మెహర్ రమేష్‌ని దర్శకుడిగా ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్‌కు ముందు, మెహర్ రమేష్ అద్భుతమైన అప్‌డేట్‌ను పంచుకున్నారు. ట్రైలర్‌లో ప్రదర్శించిన కొత్త పాట ‘కొట్టారా కొట్టు తీన్‌మార్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల కానుంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయిక. మెలోడీ బ్రహ్మ మణి శర్మ తనయుడు మహతి స్వర సాగర్ భోలా శంకర్‌కి సంగీతాన్ని అందించారు.
Also Read : Pawan Kalyan: మల్లవల్లి రైతులకు పరిహారం అందేవరకు జనసేన పోరాటం చేస్తుంది