Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 86 శాతం పూర్తయిందన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రన్ వే, ఎర్త్ వర్క్, ట్యాక్సీ స్టాండ్ 100 శాతం పనులు అయ్యాయని.. టెర్మినల్ 79, ఏటిసి 90, బిల్డింగ్స్ 62, కనెక్టింగ్ రోడ్లు 68 శాతం పూర్తయిందని వెల్లడించారు. 2026 జూన్ లో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని శుభవార్త చెప్పారు. విశాఖ నుంచి ఎయిర్ పోర్ట్ రాకపోకల కోసం సులభతరమైన రవాణా సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2026 లోపు ఏడు రహదారులను పూర్తి చేస్తామని వివరించారు. ఎయిర్ పోర్ట్ అనుసంధానంగా బీచ్ కారిడార్ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీచ్ కారిడార్ ఎలైన్మెంట్ మార్చారన్నారు. పెట్టుబడిదారులను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ అని విమర్శించారు.. ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే వైసీపీ అడుగడుగునా అడ్డు పడుతుందని ఆరోపించారు. నిర్మాణం పూర్తికాని మెడికల్ కాలేజీల కోసం మాత్రమే పీపీపీ మోడ్ లో చేయడానికి ప్రయత్నిస్తున్నామని.. కానీ వైసీపీ రౌడీయిజం చేస్తుందన్నారు.
READ MORE; Hyderabad : స్మశానంలోని రూంలో వ్యభిచార దందా నడిపిస్తున్న మహిళా
కాగా.. రెండు దశల్లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. రూ.4,592 కోట్ల వ్యయంతో తొలు దశలో 22 ఏరో బ్రిడ్జ్‌లు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించనున్నారు. 2,203 ఎకరాల్లో విమానాశ్రయం విస్తీర్ణం పూర్తి చేయనున్నారు. ఇతర అవసరాలకు ఇటీవల మరో 500 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కోటీ 3.8 కి.మీ. పొడవుతో రెండు రన్‌వేలు నిర్మిస్తున్నారు. ఏటా ప్రయాణికులు ఆరంభంలో 60 లక్షలమంది ఉండగా, అంచెలంచెలుగా ఈ సంఖ్య నాలుగు కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. 2030 ప్రారంభంలో రెండోదశ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.
READ MORE; Nandyal District: తండ్రి కర్మ కాండలు పూర్తికాక ముందే.. ఆస్తి కోసం తల్లిని చంపేందుకు కొడుకు యత్నం..
