పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీమవరంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తుందని అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ జిల్లాలు విడదీసి పరిపాలన చేశారు.. కానీ, చంద్రబాబు మాత్రం ఎలాంటి ఆలోచనా లేకుండా అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారు అని ఆయన విమర్శలు గుప్పించారు. జగనన్న కుటుంబానికి మా కుటుంబం ఎప్పటికి ఋణపడి ఉంటుంది.. 2019 ఎన్నికల ముందు పోటీ చేయకూడదు అని ఆలోచిస్తున్న సమయంలో ఓడిన, గెలిచిన ముందుకే వెళ్ళాలి.. లేదంటే మరుగున పడతాం అని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశం చేసినట్టు చేశారు అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
Read Also: A Ranjith Cinema : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ మూవీ..
ఒక పార్టీ అధ్యక్షుడిపై గెలిచినపుడు గొప్పగా అనిపించింది.. ఇపుడు చూస్తుంటే చాలా మామూలు వ్యక్తిపై గెలిచినట్టు ఉంది అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పార్టీ పెట్టినప్పుడు చేగువేరాతో పాటు మహనీయుల ఫోటో పెట్టుకున్న పవన్ ఇపుడు అవి తీసేసి.. చంద్రబాబు ఫోటో పెట్టుకున్నారు.. చంద్రబాబులో పవన్ కళ్యాణ్ కి చేగువేరా కనిపిస్తున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు. యువత పవన్ ఎం చేస్తున్నాడో ఆలోచించాలి.. కాపు సోదరులు పవన్ కళ్యాణ్ వైఖరిని గమనించాలి.. చంద్రబాబు కుట్రలకు దత్తపుత్రుడు సపోర్ట్ చేస్తున్నారు అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.