NTV Telugu Site icon

Bhimaa OTT Official: ‘భీమా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటినుంచే స్ట్రీమింగ్..!

10

10

తాజాగా హీరో గోపీచంద్ నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సినిమా ‘భీమా’. భారీ అంచనాలతో మార్చి 8వ తేదీన థియేటర్లలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుల్లో సినిమాపై మంచి టాక్ నడిచిన రానురాను సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇకపోతే కలెక్షన్ల పరంగా కూడా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ ఎప్పుడొస్తుందా అని చాలామంది వేచి చూస్తున్నారు. దీనికి తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫారంలో ఏప్రిల్ 25 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Also Read: MP Ranjith Reddy : చిలుకూరు బాలాజీ నుంచి ఎంపీ రంజిత్​ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్​ షురూ

ఉగాది పండుగ సందర్భంగా నేడు ఏప్రిల్ 25న భీమా స్ట్రీమింగ్ జరగనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ‘భీమా’ సినిమా ను ఏప్రిల్ 25వ తేదీన మీ స్క్రీన్ ల పైకి తీసుకురాబోతున్నట్లు హాట్ స్టార్ గా పంచుకుంది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

Also Read: Vinjamur: కాకర్ల సమక్షంలో టీడీపీలోకి చేరిన 100 కుటుంబాలు..

నిజానికి ఈ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలలో వస్తుందని అందరూ వేశారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలోని ఈ సినిమా ఓటీటీలో వస్తుందని భావించారు. కాకపోతే అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా ఓటీటీలోకి ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా, మరో డబుల్ యాక్షన్ లో మరో గెటప్ లో కూడా కనిపించారు. ఇక హీరో సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా కనిపించారు. వీరితోపాటు వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, నాజర్, నరేశ్ కీలకపాత్రలు ఇందులో పోషించారు.

Show comments