Site icon NTV Telugu

Bheems Ceciroleo: మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు.. ముంబాయిలో కూడా తెలియాలి!

Bheems Ceciroleo

Bheems Ceciroleo

Bheems Ceciroleo: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న ఒక పేరు భీమ్స్ సిసిరోలియో. ఈ ఏడాది సంక్రాంతి ఈ సంగీత దర్శకుడికి చాలా స్పెషల్. ఈ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో రెండు అగ్ర కథానాయకుల సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల సక్సెస్‌లో భీమ్స్ మ్యూజిక్ అదనపు బలంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి టాలీవుడ్‌లో భీమ్స్ ముందుగా లిరిసిస్ట్‌గా కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారి అనతి కాలంలోనే ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకొని, ప్రస్తుతం టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‌లో ముందు వరుసలో ఉన్నాడు.

READ ALSO: Kangana : మీలాంటి ద్వేషపూరితమైన వ్యక్తిని చూడలేదు.. రెహమాన్’పై కంగనా సంచలనం

ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లోకి సరిగ్గా ల్యాండ్ కాడానికి కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. భీమ్స్ తన కెరీర్‌లో ఫస్ట్ బాలీవుడ్ మూవీ కోసం ముంబైలో బిజీగా ఉన్నాడు. నిజానికి హిందీ చిత్ర పరిశ్రమలో భీమ్స్ సిసిరోలియో చేయబోయే ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫిషియల్ అన్సౌంట్ ఇంకా ఏది రాలేదు. ఈ రోజు జరిగిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్’ మీట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. భీమ్స్ హిందీ చిత్రం కోసం ముంబైలో బిజీగా ఉన్నాడని, అందుకే సినిమా సక్సెస్ మీట్‌కు రాలేకపోయడని చెప్పారు. దీంతో భీమ్స్ హిందీ ఇండస్ట్రీ రాయల్ ఎంట్రీపై సినిమా ప్రేక్షకులు, మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

READ ALSO: Vaibhav Suryavanshi: ఆగని వైభవ్ జోరు.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టీనేజ్ సెన్సేషన్!

Exit mobile version