NTV Telugu Site icon

Sunny Yadav: పరారీలో భయ్యా సన్నీ యాదవ్.. పోలీస్ రియాక్షన్ ఇదే

Bhayya Sunny

Bhayya Sunny

Sunny Yadav: తెలుగు మోటోవ్లాగర్ గా పేరొందిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 5న కేసు నమోదు అయింది. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అనేక మార్లు వాటిని ప్రమోట్ చేయడంతో సూర్యాపేట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఇదివరకే ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు కూడా. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసు న‌మోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యపేట ఎస్పీకి సజ్జనార్‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Read Also: Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్స్

ఇక ఈ విషయమై తాజాగా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌ ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. భయ్యా సన్నీ యాదవ్‌ సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ చెందిన వ్యక్తని, అతను తనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలలో బెట్టింగ్ యాప్స్ తరుపు ప్రకటనలు చేస్తున్నట్లు వివరించారు. దీని వల్ల యువత పై ప్రభావం పడుతుందని, అది గ్రహించి అతనిపై మార్చి 5న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలో అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.