Site icon NTV Telugu

Bhatti Vikramarkha: రాష్ట్ర ప్రజల భవిష్యత్ మునుగోడుపై ఆధారపడి వుంది

Bhatti1

Bhatti1

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేడిని రాజేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా మునుగోడు సీటుని నిలుపుకోవాలని భావిస్తుంటే.. అక్కడ గులాబీ జెండా పాతేయాలని టీఆర్ఎస్ ఉవ్విళ్ళూరుతోంది. ఇటు బీజేపీ కూడా తన సత్తా చాటేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తోంది. రాష్ట్ర భవిష్యత్ మునుగోడు తీర్పుపై ఆధారపడి వుందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. మునుగోడులో కాంగ్రెస్ బూత్ స్థాయి ఇంచార్జ్ లతో సమావేశమయ్యారు భట్టి విక్రమార్క.

మునుగోడు కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గం. మునుగోడు ప్రజలు సిద్ధాంతాలకు, భావాజలాలకు లొంగుతారు కానీ డబ్బులకు లొంగరు..మునుగోడు నియోజకవర్గ ప్రజలు రాహుల్ గాంధీ సోనియాగాంధీలపై ఆదరాభిమానాలు కలిగిన వారు..మునుగోడు నియోజకవర్గ ప్రజలు డబ్బులకు లొంగే ప్రజలు కాదు. ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన పార్టీలు ఈ నియోజకవర్గ ప్రజలను డబ్బులతో కొనవచ్చు అనుకుంటున్నారు.

Read Also: Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన బస్సు, 27 మంది మృతి

బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మగౌరవపై అడుగులు వేస్తూ డబ్బులతో రాష్ట్రం పై దాడి చేయడానికి వస్తుంది.. టీఆర్ ఎస్ పార్టీ అధికారం, డబ్బు, మద్యం తో ఇక్కడి ప్రజలను కొనాలని చూస్తుంది..ప్రతి గడపకు పరిచయమున్న అభ్యర్థి పాల్వాయి స్రవంతి..రాష్ట్ర ప్రజల భవిష్యత్ మునుగోడు ప్రజల వేసే ఓటు మీద ఆధారపడి ఉంది..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలా దోపిడీలకు అడ్డుగోడగా ఉండేలా మీ ఓటు వెయ్యాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా వున్నారు అవసరం వున్నప్పుడు పిలుస్తామ్ అప్పుడు వస్తారన్నారు.

Read Also: Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం విషయంలో సీఎంకు శ్రద్ధ లేదా..?

Exit mobile version