Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: రక్షాబంధన్ పండగ రోజున తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక రాష్ట్రం, రాయచూర్ జిల్లాలోని ‘హట్టి గోల్డ్ మైన్’ను సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు.

హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. సింగరేణి సంస్థ వేలంలో దక్కించుకున్న ‘దేవదుర్గ బంగారం-రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్’ కూడా ఈ హట్టి గోల్డ్ మైన్స్ సమీపంలోనే ఉంది. సందర్శనలో భాగంగా భట్టి విక్రమార్క భూగర్భ గనితో పాటు ఓపెన్ కాస్ట్ గనిని కూడా పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి వెంట సింగరేణి సిఎండి బుద్ధ ప్రకాష్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జిఎమ్ పంకజ్ కులశ్రేష్టలతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.