నేడు ఆదిలాబాద్ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నారు. పాదయాత్ర ప్రారంభించిన ఊరు పిప్పిరిలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు పిప్పిరి గ్రామానికి డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క చేరుకోనున్నారు. అధికారులతో జిల్లా అభివృద్ది పురోగతి, అమలవుతున్న పథకాలు, సంక్షేమం గురించి సమీక్షిస్తారని, ఆ తరువాత ఎస్టీఎస్‌డిఎఫ్ రూ.15 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.2 కోట్లతో వాంకిడి సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.3.5 కోట్లతో పిప్పిరి గ్రామాంలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. సభ ముగిసిన తరువాత ఎస్సీ కార్పోరేషన్, ట్రైకార్, ఐటీడీఏల ద్వారా మంజూరైన బ్యాంకు లీంకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు.