NTV Telugu Site icon

Bhatti Vikramarka : గత పదేళ్ళు ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గురైంది..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పెద్దయెత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ… నియామక పత్రాలు అందించడం… ఆనందంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అవసరాల ను తీర్చడం కోసం… ప్రతినెల ఆరోగ్య శాఖ కు నిధులు విడుదల చేయాలంటే నీళ్ళు మింగాల్సిన పరిస్థితి అని, ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆరోగ్య శాఖ పై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు , పేదవారికి, మధ్యతరగతి లో గానీ ఆయా కుటుంబాల్లో ఆరోగ్యం విషమిస్తే… ఆర్థికంగా పెట్టుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారని, అందుకే రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం లో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, సదుపాయాల కల్పన విషయంలో పూర్తి స్థాయిలో మేము అందించే ప్రయత్నం చేస్తున్నామని, గత పదేళ్ళు ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గురైందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళారు.. ఇప్పుడు వాటికి అతికష్టం మీద వడ్డీలు కడుతున్నామన్నారు.

Minister Nadendla Manohar: కాకినాడ పోర్టులో పట్టుపడిన రేషన్‌ బియ్యం.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

అంతేకాకుండా..’సంవత్సరం కూడా అధికారం లేకపోతే ఉండలేక పోతున్నారు.. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు… BRS వారు ఆరు గ్యారెంటీలు అమలు పై గోల చేస్తున్నారు… 21 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం కేటాయించాం.. 55వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.. 200 యూనిట్స్ కి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. మహాలక్ష్మి పథకం..అమలు చేస్తూ కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం.. పదేళ్ళు మీరు హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు… మేము 40 శాతం డైట్ చార్జీలు పెంచాం.. 5 వేల కోట్ల రూపాయలతో 30 ఇంటిగ్రేటెడ్ గురుకులాలు నిర్మిస్తున్నాం.. పరిశ్రమలు తీసుకొచ్చి విశ్వ నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం.. అలాగే వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు 6 వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు పునాదులను రాష్ట్ర క్యాబినెట్ వేసింది.. ఇన్ని చేస్తుంటే ప్రతిపక్ష BRS, BJP లు ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.. అలా రెచ్చగొడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు.. విద్యా, వైద్యం మా మొదటి ప్రాధాన్యత… నిధులు కేటాయిస్తాం..’ అని భట్టి విక్రమార్క అన్నారు.

Health: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే మంచిదేనా..?