Bhatti Vikramarka: భారత్ జోడో యాత్రకు కొనసాగింపే ఈ పీపుల్స్ మార్చ్ యాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను తెలుసుకున్నామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్‌ను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించామని భట్టి పేర్కొన్నారు. దేశమంతా ఐక్యంగా ఉండాలని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. పీపుల్స్ మార్చ్ భట్టి యాత్ర కాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన యాత్ర అని ఆయన చెప్పుకొచ్చారు. అధికార మదంతో విర్రవీగుతున్న వారికి వ్యతిరేకంగా చేసిన ప్రజలు చేసిన యాత్ర అంటూ భట్టి విక్రమార్క చెప్పారు.
Also Read: Bhatti Vikramarka: ముగిసిన భట్టి పీపుల్స్ మార్చ్.. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర.
రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపింటారు. కేసీఆర్ చేతల ప్రభుత్వం కాదని.. మాటల ప్రభుత్వమని మండిపడ్డారు. ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారని.. ధరణికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెప్పారని ఈ సందర్భంగా భట్టి చెప్పుకొచ్చారు. ధరణికి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారన్నారు. మన రాష్ట్రం వస్తే భూములు వస్తాయని అనుకున్నారని.. కానీ పోడు రైతులను భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగాయన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
పీపుల్ మార్చ్‌లో పాదయాత్రలో తనను అడుగుడుగునా ప్రోత్సహించారని భట్టి తెలిపారు. మాకు ఇల్లు ఇవ్వండి, మీ వెంట నడుస్తామని ప్రజలు అన్నారని ఆయన తెలిపారు. ఉన్నత చదువులు చదివిన వారు, క్రీడాకారులు చిన్న చిన్న పనులు చేయడం ఈ పాదయాత్రలో కనిపించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మారుస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిందేనన్నారు. యువకులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన భూములను ఏ ఒక్క ఎకరాను లాక్కున్న చూస్తూ ఊరుకోమన్నారు.