Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులను డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, వైద్య సేవల మెరుగుదలపై సర్పంచులు ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌లో 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రదర్శించినట్లు చెప్పారు. 2047 కల్లా రాష్ట్రంలో ఒక లక్ష 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.
Komaram Bheem: కోమరంభీం జిల్లాలో 15 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 5 లక్షల 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో మొత్తం 131 గ్రామపంచాయతీలకు గాను 90 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు గెలవడం చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళలకు 20 వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, రైతులకు 9 వేల కోట్ల రూపాయలతో రైతు భరోసా అందజేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు.
Dhurandhar: ధురంధర్ సినిమా.. నిజజీవితంలో రహమాన్ డకైత్‌ను చౌదరి అస్లాం ఎలా ఎన్‌కౌంటర్ చేశారు.?
