Site icon NTV Telugu

Bhatti Vikramarka: కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే.. బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇక్కట్లను తెచ్చాయి

Batti Vikramarka

Batti Vikramarka

తెలంగాణ ఆవిర్భావం జూన్ 02 రోజున భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను లేకుండా చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూ భారతి చట్టం చరిత్రాత్మకం అని అన్నారు. భూ సంస్కరణలు తెచ్చింది మొదట కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు.

Also Read:JK: పహల్గామ్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులపై వేటు

మొదటి చట్టం కాంగ్రెస్ దే.. రెండో చట్టం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందేనని స్పష్టం చేశారు. భూ సంస్కరణల చట్టం కూడా కాంగ్రెస్ తీసుకుని వచ్చిందని తెలిపారు. 2020 లో బీఆర్ఎస్ ధరణి చట్టాన్ని తీసుకొచ్చింది. ధరణి చట్టంతోనే సమస్యలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే.. బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇక్కట్లను తెచ్చాయన్నారు. ధరణిలో కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చట్టం చేశారన్నారు. ధరణికి తాళం వేసుకుని కూర్చున్నారు..

Also Read:JK: పహల్గామ్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులపై వేటు

భూములు కబ్జా చేసి అక్రమాలకు పాల్పడి వాటిని మార్చకుండా చేసేందుకు ధరణికి తాళం వేసేశారు ఆనాటి పెద్దలు అని మండిపడ్డారు. అనాడు బూర్గుల రామకృష్ణ రావు గురించి ఎలా చెబుతామో నేడు పొంగులేటి గురించి కూడా అలా చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో భూమికి పన్ను కట్టేవాళ్ళము. నేడు అది లేకుండా పోయింది. గతంలో జమాబంది వుండడం ద్వారా వివాదాలకు ఆస్కారం లేకుండా పోయింది. అసైన్ మెంట్ కమిటీలు లేకపోవడం వల్ల నష్టం కూడా జరిగిందని వెల్లడించారు.
YouTube video player

Exit mobile version