NTV Telugu Site icon

Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు అస్వస్థత.. తీవ్ర జ్వరంతో ఇబ్బంది

Batti

Batti

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. నకిరేకల్ మండలం కేతపల్లిలో లంచ్ విరామ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ 97వ రోజు ఆరున్నర కిలోమీటర్ల మాత్రమే పాదయాత్ర పూర్తి చేశారు.

Read Also: Adipurush: ‘ఆదిపురుష్’లో తప్పేముంది?.. చిలుకూరి ఆలయ పూజారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ప్రమాదకరమైన ఎండలో పాదయాత్ర చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయి.. షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరమని తెలిపారు. డాక్టర్ సూచనల మేరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆరోగ్యం కుదటపడగానే యథావిధిగా పాదయాత్ర సాగుతుందని భట్టి విక్రమార్క సంబంధీకులు చెబుతున్నారు.

Read Also: Bellam Bondalu : పిల్లలు ఇష్టంగా తినే తియ్యని బొండాలను ఎలా చేస్తారో తెలుసా?

మరోవైపు భట్టి విక్రమార్క పాదయాత్ర.. 97 రోజులుగా కొనసాగుతుంది. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన పీపుల్స్ మార్చ్.. ఉమ్మడి 7 జిల్లాల్లో కొనసాగనుంది. దాదాపు 1365 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరగనుంది.