Bhatti Vikramarka: ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత!
- సివిల్స్-2024 విజేతలకు సన్మాన కార్యక్రమం
- సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న భట్టి, కోమటిరెడ్డి
- నిస్సహాయకులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి అందించే ఓ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. గతేడాది అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారని, 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్నారు. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిస్సహాయకులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్-2024 విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
‘మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఎంతో కొంత సాయం అందించాలని మేం ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం సాయం కాకపోయినా.. కొంత మీకు అండగా ఉండాలని అభయ హస్తం ఇస్తున్నాం. మెయిన్స్‌కు వెళ్తున్న వారికి లక్ష సాయం చేస్తున్నాం, కొంత కొచించ్కి ఉపయోగ పడుతుందని ప్రభుత్వ ఆలోచన. లాస్ట్ ఇయర్ అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారు. 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలి. సివిల్ సర్వెంట్ల సమావేశాల్లో కొందరు ఐఏఎస్‌లను రోల్ మోడల్‌గా చెప్తారు. మాధవరావు, ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుంది. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత. నిస్సహాయకులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు సక్సెస్ అవుతాయి. మాకు ఎంత చేయాలి అని ఉన్నా.. ఐఏఎస్‌లలో నిబద్ధత లేకుంటే లక్ష్యం చేరుకోలేం. శంకరన్ లాంటి వాళ్లు సంక్షేమ శాఖల్లో పని చేశారు. మిషన్ లాగ పని చేస్తే.. ప్రజలు కూడా మిషన్ లాగే మర్చిపోతారు. సవాళ్లను అధిగమించి లక్ష్యం సాధించండి’ అని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.
Also Read
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
Also Read: KTR Tweet: దరఖాస్తులు తప్పితే దమ్మిడీ ఇచ్చింది లేదు.. కేటీఆర్ ట్వీట్ వైరల్!
‘స్కిల్ డెవలప్మెంట్ నుంచి.. ఇవాళ సివిల్స్‌కి వెళ్లే వారి వరకు అందరికీ ప్రభుత్వం సహకారం అందిస్తున్నాం. 55 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణ కి ఇప్పటికే టెండర్లు పిలిచాము. రైతు కొడుకు రైతే అవుతున్నాడు. మేము ఐదేళ్లు.. పదేళ్లు పదవుల్లో ఉంటాం. సివిల్స్ సాధించి మీరు ప్రజల సేవలో ఉండండి. కాన్ఫిడెన్స్‌తో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. డిల్లీలో నా క్వార్టర్స్‌ను చదువుకునే వారికే ఇచ్చా. నా క్వార్టర్స్‌లో ఉండి చదువుకున్న ఇద్దరు ఇప్పుడు నా జిల్లాలోనే సర్వీసులో ఉన్నారు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!