NTV Telugu Site icon

Bhatti Vikramarka : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగింది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ఎన్టీఆర్‌ మార్గ్‌ లో నిర్వహించిన హైదరాబాద్‌ రైజింగ్‌ సభలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు కాదు నువ్వు, నీ కుటుంబం గుడిసె వేసుకొని జీవించి చూపించన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి ఒక రోజు మూసి తీరంలో నిద్ర చేసి తర్వాత విలాసమైన ప్యాలెస్ లో ఉండటం సరికాదని, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలు బాగుపడటం బీఆర్‌ఎస్‌కి ఇష్టం లేదన్నారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ నగర అభివృద్ధికి పది పైసలు ఖర్చు చేయలేదన్నారు భట్టి విక్రమార్క.

IND vs AUS: విరాట్ కోహ్లీకి గాయం..! అభిమానుల్లో టెన్షన్

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగిందని, మూసిని జీవ నదిగా మార్చాలని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు భట్టి విక్రమార్క. ఢిల్లీ లాంటి ముప్పు రావొద్దని కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, దేశం గర్వించే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ ను మార్చాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని, నక్లెస్ రోడ్డులో జరిగిన తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

Zomato Large Order Fleet: జొమాటోలో ఉన్న ఈ ఫీచర్‌ గురించి తెలుసా?

Show comments