Site icon NTV Telugu

Bhatti Vikramarka : అప్పులు పుట్టక‌పోవ‌డంతో రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

పీపుల్స్‌ మార్చ్‌ పేరిట సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మిగుటు బ‌డ్జెట్ తో ధ‌నిక రాష్ట్రంగా తెలంగాణనే ఏర్పాటు చేసింది. ఈ తొమ్మిదిన్న‌ర ఏళ్ల‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం ఎటువంటి ఆస్తులును, వ్య‌వ‌స్థ‌ల‌ను, బ‌హుళార్ధ‌క సాధ‌క ప్రాజెక్టును, సంప‌ద‌ను, ప్రాజెక్టుల‌ను సృష్టించ‌లేదన్నారు. రాష్ట్ర బ‌డ్జెట్ తో పాటు ఇంకా రూ. 5 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి కూడా రాష్ట్రానికి ఎటువంటి సంప‌ద‌ను సృష్టించ‌లేదని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ‘ చివ‌ర‌కు ఈ రాష్ట్రానికి బ్యాంకులు కూడా అప్పు ఇవ్వ‌లేమ‌ని చెప్పేస్థాయికి కేసీఆర్ దిగ‌జార్చాడు. అప్పులు పుట్ట‌క‌పోవ‌డంతో రాష్ట్రాన్ని అమ్మ‌కానికి పెట్టాడు. చివ‌ర‌కు తిన‌డానికి తిండి లేని నిరుపేద‌ల‌కు , భూమిలేని వారికి ఆత్మ గౌర‌వంతో బ‌త‌కాల‌ని నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఇచ్చిన అసైండ్ భూముల‌ను వెన‌క్కు తీసుకుని లే అవుట్ చేసి అమ్మ‌కానికి పెట్టాడు. ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం అసైండ్ భూములు తీసుకోవ‌డం అంటే ప్రాజెక్టులు క‌ట్ట‌డం, కాలువ‌లు త‌వ్వ‌డం కోసం, జాతీయ ర‌హ‌దారులు వేయ‌డానికి మాత్ర‌మే తీసుకోవాలి. అది 13 యాక్ట్ ప్రకారం డ‌బ్బులు చెల్లించి తీసుకోవాలి.

Also Read : Warming World: ప్రతీ సెకన్‌కు 10 ఏసీల అమ్మకం.. నివేదికలో వెల్లడి..

ఇందుకు విరుద్ధంగా అసైండ్ భూముల‌ను వెన‌క్కు తీసుకుని క‌మ‌ర్షియ‌ల్ యాక్టివిటీస్ చేసి ప్లాట్లుగా మార్చి వేలం వేసే అధికారం ఈ ప్ర‌భుత్వానికి ఎవ్వ‌రూ ఇవ్వ‌లేదు. చ‌ట్టాల‌ను తుంగ‌లో తొక్కి పేద‌వాళ్ల‌ను బెదిరించి, భ‌య‌పెట్టి పేద‌లు, ద‌ళితుల‌తో బ‌ల‌వంత‌పు సంతకాలు పెట్టించుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 30 వేల ఎక‌రాలు సేక‌రించి అమ్మ‌కానికి మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆనాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు పంచిన భూముల‌ను ఇప్ప‌టికే వెన‌క్కు లాక్కుని, అత్యంత సంప‌న్న బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు అప్ప‌నంగా ఇచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఇచ్చింది పేద‌లు, అణ‌గారిన‌, అట్ట‌డుగు, బ‌ల‌హీన‌, ద‌ళిత, గిరిజన‌, ఆదివాసీలు, తెలంగాణ బిడ్డ‌లు బ‌తికేందుకు కానీ.. బ‌హుళ‌జాతి సంస్థ‌ల కోసం ఏమాత్రం కాదు. అసైండ్ భూములు పొందిన యావ‌త్ తెలంగాణ‌లోని స‌క‌ల జ‌నుల‌కు నేను ఒక్క‌టే పిలిపిస్తున్నాను. భూముల‌ను కాపాడుకోవాల్సిన భాధ్య‌త మ‌నంద‌రిప‌సైనా ఉంది. మీ భూమి కోసం మీరు నిల‌బ‌డండి. మీకు భూములు పంచిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేడు మీకు అండ‌గా ఉంటుంది. మీ త‌ర‌ఫున పోరాటం చేస్తుంది. ‘ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Also Read : Strange Incident: అంత్యక్రియల్లో విచిత్ర ఘటన.. చనిపోయిన భార్య కంట్లోంటి కన్నీళ్లు.. కట్ చేస్తే!

Exit mobile version