NTV Telugu Site icon

Bhatti Vikramarka : లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

CLP Leader Bhatti Vikramarka Criticized TRS Government.

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించారు. దీంతో వరదలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వరద నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై విఫలమైందని అధికారులు అప్రమత్తంగా లేరని, ఆ దిశగా సర్కార్‌ దిశానిర్దేశాలు జారీ చేయలేదంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. పొడు భూముల బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, విభజన హామీ చట్టంలోని హామీలను తెలంగాణ సర్కార్ తీసుకురావడంలో విఫలం చెందిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విభజన హామీలపై కేంద్ర సర్కార్ ను నిలదీస్తానన్నారు. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతి కూడా కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావిస్తారని, వరదల్లో ప్రజలు పూర్తిగా నష్ట పోయారన్నారు.

Revanth Reddy : విధిలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రగతి భవన్ గేటు దాటారు

క్యాంపులలో కూడా సరైన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందింది. గోదావరి పై బ్యారేజీ లు కట్టినప్పుడే బ్యాక్ వాటర్ తో ఇబ్బందులు అని అప్పట్లో కాంగ్రెస్ నేతలు లెవనెత్తారు. బ్యాక్ వాటర్ తో మంచిర్యాల ,మంథని, ములుగు,జగిత్యాల ,చెన్నూరు నియోజకవర్గలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. పంట నష్టంపై కూడా తెలంగాణ సర్కార్ అంచనాలు వేయలేదు. వరదల వల్ల పంట నష్టంను వెంటనే తెలంగాణ సర్కార్ అంచనా వేయాలి. విపత్తులలో ఇళ్ళు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి. వరద క్యాంపు నుంచి ఇంటికి వెళ్లే వారిలో ప్రతి ఫ్యామిలీకు తెలంగాణ సర్కార్ 25 వేల రూపాయలు ఇవ్వాలన్నారు భట్టి విక్రమార్క.