NTV Telugu Site icon

Bhatti Vikramarka : ట్విట్టర్, సోషల్ మీడియాలకే కేటీఆర్ హరీష్ రావులు పరిమితం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలకు అతలాకుతలమవుతున్నాయి. అయితే.. అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ట్విట్టర్, సోషల్ మీడియాలకే కేటీఆర్ హరీష్ రావులు పరిమితమయ్యారని విమర్శించారు. వారు ప్రజలను మర్చిపోయారని, తమది గడిల పాలన కాదని, మేము గడి లకు పరిమితం కాలేదన్నారు భట్టి. వరదలు రాగానే ప్రజలలోనే వున్నామని, సహాయ చర్యలను అందించామన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ప్రభుత్వం కీలకంగా పని చేసిందని, గతం లో చిన్న వర్షం వస్తే హైదరబాద్ లో బీఆర్‌ఎస్‌ చేతులు ఎత్తేసే వారని ఆయన అన్నారు. ఇప్పుడు హైదరబాద్ ను అద్భుతంగా తయారు చేస్తున్నామని, నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ప్రజలు వద్దకు వస్తే ప్రజలు తిరగబడతారని అదే సోషల్ మీడియాలో అయితే ఏదైనా చెప్పే అవకాశం ఉండటంతో వారు సోషల్ మీడియాకే పరిమితం అయ్యారని విమర్శించారు. అధికారులు కూడా మనుషులే అని రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి అభినందిస్తున్నానన్నారు.

Actor Jiiva: నీకు అసలు బుద్ధుందా?.. రిపోర్టర్‌పై రెచ్చిపోయిన హీరో జీవా!

ఇదిలా ఉంటే.. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే.. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Russia Ukraine War : అర్థరాత్రి రష్యా పై 150కి పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్