NTV Telugu Site icon

Bhatti Vikramarka : త్వరలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుంది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రెండో యూనిట్‌లో ఆయిల్ సింక్రానైజేషన్ చేసామని, త్వరలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, గత ప్రభుత్వానికి యాదాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. NGT కి సకాలంలో సమాచారం ఇచ్చి ఉంటే పర్యావరణ అనుమతుల ఇబ్బంది ఉండేది కాదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పనుల్లో వేగం పెరిగిందన్నారు భట్టి విక్రమార్క. 31 మార్చ్ 2025 లోగా అన్ని యూనిట్ లలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా పని చేస్తున్నామని, 3 యూనిట్ లలో ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు భట్టి విక్రమార్క. ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి. త్వరలో జాతికి అంకితం చేస్తామని, స్థానికులు పవర్ ప్లాంట్ కోసం తమ భూములను త్యాగం చేసారు.. వారందరికీ పరిహారం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు భట్టి విక్రమార్క.

China: డ్యూటీలో ఉండగా ప్రేమికులు ముద్దులు.. కంపెనీ ఏం చేసిందంటే..!