ఢిల్లీలో కోల్, పవర్ కేంద్ర మంత్రులను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఇద్దరు కేంద్ర మంత్రులను కలిశామన్నారు. కోల్ మినిస్ట్రీ, సింగరేణికి కావాల్సిన కోల్డ్ బ్లాక్స్ గురించి సింగరేణి సమస్యల గురించి సింగరేణి అవసరాల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సింగరేణి తాడిచెర్ల సెకండ్ బ్లాక్ ఎన్నో ఎళ్లుగా పెండింగ్లో ఉందని, 2013లో ఆలస్యం చేసారని, తాడిచర్ల టు బ్లాకు ను మైనింగ్ లీస్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి కోసం.. గత పదేళ్లుగా కేంద్రం అనుమతి తీసుకోకపోవడం వల్ల తాడిచర్ల సింగరేణి బ్లాకులో మైనింగ్ చేయలేకపోయామన్నారు. తెలంగాణలో పవర్ డిమాండ్ పెరిగిన దృశ్య కోల్డ్ ప్రోడక్ట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాడిచెర్ల గోల్డ్ బ్లాక్ టు లో దాదాపు 5 మిలియన్ టన్నుల కోన్ ఉత్పత్తికి అవకాశం ఉందని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’త్వరలోనే తాడిచర్ల టు కోల్ బ్లాక్ కి ప్రేయర్ అప్రూవల్ ఇస్తామన్నారు ఇది తెలంగాణకు శుభవార్త. తాడిచెర్ల టు మైనింగ్ ప్రారంభమవుతే సింగరేణి నీ లాభాల్లోకి తీసుకురావడమే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఒరిస్సా లో ఉన్నటువంటి నైని బ్లాక్ గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. పదేళ్ల కింద తెలంగాణకు నైని కోల్డ్ బ్లాకులో అలర్ట్ చేసినా కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన ఆపరేషన్ అందుబాటులోకి రాలేదు. కాల్ గనుల సమస్యలన్నీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ ను కూడా కలిసాం. దేశవ్యాప్తంగా గ్రీన్ పవర్ కావాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు కోరుతున్నారు. కేంద్రం ఇటీవలే ప్రధానమంత్రి సూర్యగర్ మోప్తు బిజిలి యోజనను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోలార్ స్కీం పై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్యానల్స్ పైన పెట్టేందుకు రూప్ సరిగా లేకున్నా, పేదవాళ్లు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఈ స్కీం వల్ల వాళ్లకు వచ్చే లబ్ధి ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు ఒక ఆలోచన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్స్టేషన్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో వర్చువల్ మీటరింగ్ విధానంతో సోలార్ ప్యానల్ లను ఏర్పాటు చేసి అక్కడి నుంచే పేద ఇళ్ళకు కరెంటు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కాకుండా ఇతర అమౌంట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించి పథకాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచన తో కార్యాచరణను సిద్ధం చేశాం. మా ప్రతిపాదన సోలరైజేషన్ను త్వరగా ప్రజలకు అందించేందుకు ఉపయోగపడుతుంది.’ అని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే.. అధికారం కోల్పోయి ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయారు ఏది పడితే అది మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పొలిటికల్ కామెంట్స్ చేశారు. వర్షం వచ్చిందా లేదా అనేది ఎంత నమోదయింది అనేది సైంటిఫిక్ గా నమోదు చేసి సిస్టం భారతదేశంలో ఉందని,
అవగాహన లేక మాట్లాడితే వాళ్ళ అవగాహన లోపమేనన్నారు. పరిపాలన అంటేనే ఎటువంటి క్రైసెస్నైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నట్టు. నీటి ఎద్దడి పై కూడా మాకు యాక్షన్ ప్లాన్ ఉంది. వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇది తెలంగాణలోనే కాదు అంతట సమస్యగా ఉంది. తెలంగాణలో బెంగళూరు వంటి ఇబ్బంది రావద్దని అందరూ కోరుకోవాలి. కేటీఆర్ ఇంజనీర్ కాదు కేసీఆర్ ఇంజనీరు కాదు వాళ్లకు వాళ్లే ఎక్కువగా ఊహించుకుంటున్నారు. వాళ్లు డిజైన్ చేయడం వల్లనే ప్రాజెక్టు కూలిపోయింది. డ్యామ్ సేఫ్టీ నిపుణులు పరిశీలన చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే. అడ్డగొలుగా మాట్లాడొద్దు. ప్రదేశం కమిటీతో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది. మేము సరైన సమయంలో పార్లమెంట్ అభ్యర్థులను అనౌన్స్ చేస్తాం’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
