Site icon NTV Telugu

Bhatti Vikramarka : స్టాఫ్ నర్సుల నియామకంతో మాట నిలబెట్టుకున్నాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్‌కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 7వేల మంది స్టాఫ్ నర్సులను పెద్ద ఎత్తున ఒకేసారి నియామకం చేసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మాటను స్టాఫ్ నర్సుల నియామకంతో నిలబెట్టుకున్నామన్నారు భట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతీ యువకుల కలలను సహకారం చేయడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బద్ధులమై పనిచేస్తామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన విషయం మీకు తెలుసు అని ఆయన అన్నారు.

ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ, నర్సుల నియామకంతో నెలకు రాష్ట్ర ప్రభుత్వంపై 500 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ అన్ని ఆర్థిక పరిస్థితులను అధిగమించి పైసా పైసా పోగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజా సంక్షేమం కొరకే,

ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు చేయడానికి అకుంఠిత దీక్షతో పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగం సాకారం కావాలని కలలు కంటున్న వారి తల్లిదండ్రుల ఆశలు ఈ ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకుల కలలు నిజం చేయాలని పార్లమెంట్లో సంఖ్యా బలం లేకున్నా అన్ని పక్షాలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version