Site icon NTV Telugu

Bhatti Vikramarka : ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. లక్ష రుణమాఫీ కి ఐదేళ్లు తీసుకుని.. అవి కూడా చేయని బీఆర్‌ఎస్‌ మాపై అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ పెట్టాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా మొత్తము వ్యవసాయం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామన్నారు. మేము ఇచ్చే ప్రతి పథకం ప్రజల సొమ్ముతోనే.. ప్రజల సొమ్ముకు మేము కస్టోడీయన్ మాత్రమే అని ఆయన వెల్లడించారు. ప్రజల మధ్య చర్చకు పెట్టి..అందరి అభిప్రయాలు తీసుకుంటామని, బడ్జెట్ సమావేశాల కంటే ముందే రైతు భరోసా పై అభిప్రాయం సేకరిస్తామన్నారు. అసెంబ్లీ లో నివేదిక పెడతామని, ప్రజల ఆలోచన మేరకే సంపద పంచుతామన్నారు భట్టి విక్రమార్క. రైతులు.. ట్యాక్స్ చెల్లించే వారూ.. మేధావులతో మాట్లాడతామని, బీఆర్‌ఎస్‌ వాళ్ళు ఆశ పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎదో ఒకటి చేస్తే బాగుండు.. అని ఆయన వ్యాఖ్యానించారు.

 

పాత పది జిల్లాల్లో అభిప్రాయం సేకరిస్తున్నట్లు తెలిపారు. నా నియోజక వర్గం లో రైతు ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. ఎవరు ప్రోత్సహించారు అనేది విచారణ జరుగుతుందన్నారు. ఎవరన్న చర్యలు తప్పవని, కేబినెట్ విస్తరణ అధిష్ఠాభం ఇష్టమన్నారు భట్టి విక్రమార్క. పీసీసీపై త్వరగా నిర్ణయం చేయాలని చెప్పామన్నారు. పీసీసీ నియామక కసరత్తు మొదలు పెట్టారని, బీఆర్‌ఎస్‌ నేతలపై భట్టి ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో 7 మండలాలు లేవని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత brs అధికారంలో ఉండగా ఏడు మండలాలు విలోనం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. పదేళ్లు గాలికి వదిలేసి.. ఇప్పుడు తగుదునమ్మ అని మట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్‌ వల్లనే ఏడు మండలాలు కోల్పోయామన్నారు. దీక్షకు కూర్చోండని ఆయన అన్నారు. హరీష్ రావు లాంటి కల్లబొల్లి మాటలు చెప్పామని, రైతులకు మేము ఆలస్యం చేయం నష్టం చేయమన్నారు. రేవంత్ చాలా సార్లు చెప్పారని, చంద్రబాబు గురువు కాదు..సహచరులు అన్నారు. . చంద్రబాబు ఏపీ సీఎం.. రేవంత్ తెలంగాణ సీఎం అని భట్టి విక్రమార్క అన్నారు.

Exit mobile version