NTV Telugu Site icon

Bhatti Vikramarka : రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలి

Bhatti

Bhatti

దేశాన్ని ఏకం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దేశ సంపద ఈ ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ చేస్తున్న పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాలని కోరారు. లౌకికవాదం కలిగిన ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడి బిడ్డనేన‌ని మతం పేరిట విభ‌జ‌న చేయ‌డం త‌గ‌ద‌న్నారు. మత విభజన పేరిట వైశ్యామ్యాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలను పార్లమెంటు ఎన్నికల్లో దూరం పెట్టాలని ప్ర‌జ‌ల‌కు విజ్ఙ‌ప్తి చేశారు.

 

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిజం చేస్తున్నామ‌ని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్ర‌మాణం చేసిన రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోప‌ల‌నే మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంలో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప‌థ‌కాన్ని ప్రారంభించామ‌న్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని రూ.10ల‌క్ష‌ల‌కు పెంచామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10.50 కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. వ‌చ్చే నెల‌లో మ‌రో రెండు ప‌థ‌కాలు ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ప్రభుత్వానికి ప్రజల మధ్యన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారధులుగా పని చేసి ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందేలా చూడాలన్నారు.

 

Show comments