Site icon NTV Telugu

Bhatti Vikramarka : ఈ ఫార్ములా ట్రై పార్టీ రేసింగ్‌ను.. బై పార్టీ రేసింగ్‌గా మార్చారు..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

జరిగిన ఆర్థిక అరాచకత్వం – కొద్ది మంది ప్రయోజనాలు, ప్రాపకం కోసం చేసిన వాటిని సరిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ – రేసింగ్ వల్ల ఒకరు టికెట్లు అమ్ముకున్నారు, మరొకరు రేసింగ్ చేసుకున్నారు మరి ఇన్ఫ్రాసట్రక్చర్ ఇచ్చిన రాష్ట్రానికి ఆదాయం సున్నా అన్నారు భట్టి. ఈ ఫార్ములా ట్రై పార్టీ రేసింగ్ ను – బై పార్టీ రేసింగ్ గా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. టికెట్లు అమ్మేవాళ్లు, రేసింగ్ వాళ్ళు కలిపి 110 కోట్లు కట్టాలి కానీ కట్టలేదని, రెండో అగ్రిమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ టే అనుమతులు ఇప్పించాలి, తిరిగి డబ్బులు కట్టాలన్నారు భట్టి విక్రమార్క.

 

110 కోట్లలో ఇప్పటికే సగం పైసలు కట్టారు – రెండో ఇన్స్తల్మెంట్ కోసం ప్రభుత్వానికి రేసింగ్ సంస్థ నోటీసులు పంపిందని, అగ్రిమెంట్ కోసం మంత్రి సంతకాలు లేవు, కేబినెట్ అప్రూవల్ లేదు, ఓరల్ ఆదేశాలతో mou జరిగిందన్నారు భట్టి విక్రమార్క. మాజీ ఐటి మంత్రి పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారని, తమ కోరికలను తీర్చుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్న నాయకులు ఇంకా బ్రమల్లోనే ఉన్నారని, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు భట్టి విక్రమార్క.

Exit mobile version