Site icon NTV Telugu

Bhatti Vikramarka : ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో నూత‌న ఉత్సాహాన్ని నింపాలి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఇందిరమ్మ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, క‌నుమ పండుగ‌ల‌ను ఆనందంగా జ‌రుపు కోవాల‌ని, సంక్రాంతి పండుగ రైతుల
జీవితాల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రికి నూత‌న ఉత్సాహాన్ని తీసుకురావాల‌ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోగీ, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాధులతో సంతోషంగా జరుపుకునే పండుగ ప్రతి ఇంట్లో వైభవంగా
జరుపుకోవాలని ఆకాంక్షించారు. కొత్త పంటతో చేసుకునే తీపి పరమన్నాలను కుటుంబ సభ్యులు ఆనందంగా ఆస్వాదించడంమే సంక్రాంతి
పర్వదిన గొప్పదనమని అన్నారు.

హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.. భోగి మంటలు, వేకువజామునే జంగమదేవరల జే గంటల మధ్య సంక్రాంతి శోభ ఉట్టి పడుతుందని భట్టి అభివర్ణించారు. మన సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ సంక్రాంతి అని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మార్పు కోరుకున్న తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.

Exit mobile version